అసెంబ్లీ గేట్ ఘర్షణ కేసు: సైఫాబాద్ పోలీసుల ఎదుట కేటీఆర్ పీఏ విచారణ

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గేట్ నంబర్-3 వద్ద జరిగిన ఘర్షణ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్ సైఫాబాద్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు లాయర్ల సమక్షంలో పోలీసులు వారి స్టేట్ మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. పండుగ పూట కావాలనే తమను ఇబ్బంది పెడుతున్నారని పీఆర్వో మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు.