జంతర్ మంతర్ షాకింగ్ నిర్ణయం: నిరసన వేదికల జాబితా నుంచి తొలగింపు
రిపోర్టర్: సతీష్
స్థలం: ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ నిరసన వేదిక జంతర్ మంతర్ను ఆందోళనల జాబితా నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. హోం శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇకపై అక్కడ నిరసనలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. పార్లమెంటుకు అత్యంత సమీపంలో ఉండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు.