జేసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ సిగ్మా ట్రైలర్ విడుదల

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తమిళనాడు

తమిళ స్టార్ హీరో విజయ్ వారసుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సిగ్మా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గ్యాంబ్లింగ్, డ్రగ్స్ మరియు మనీ హైస్ట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 2, 2026 న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.