పారదర్శకత కొరవడిన నెల్లూరు ఎస్జీఎఫ్ క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారిందని వ్యాయామ ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పేరుకు కొత్త కార్యదర్శులను ఎంపిక చేసినా పాత వారే పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సోమవారం జరిగే పోటీలను శనివారం సాయంత్రం ప్రకటించడంతో చాలామంది విద్యార్థులకు సమాచారం అందలేదని పలువురు వాపోయారు. ఒకే రోజు అన్ని కేటగిరీల పోటీలు నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయిని ఎస్జీఎఫ్ కార్యదర్శి మల్లికార్జునరావు తెలిపారు.