హైవేపై ఘోర విమాన ప్రమాదం: బద్రీనాథ్ వెళ్తుండగా హెలికాప్టర్ కూలి ఆరుగురు దుర్మరణం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Chamoli
బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న హెలికాప్టర్ చమోలి జిల్లాలోని జ్యోతిమఠ్ సమీపంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కూలిపోయిందని, పైలట్‌తో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ఎన్.కె. జోషి వెల్లడించారు. ఈ ప్రమాద సమాచారం అందిన వెంటనే ఆర్మీ, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయని అధికారులు స్పష్టం చేశారు.