అస్సాంలో అక్రమంగా ప్రవేశించిన ఇరవై ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

రిపోర్టర్: కిరణ్ స్థలం: అస్సాం

అస్సాం రాష్ట్రంలో ఎలాంటి సరైన పత్రాలు లేకుండా అక్రమంగా ప్రవేశించిన ఇరవై ఏడుగురు బంగ్లాదేశీయులను గువహటి మరియు రంగియా ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ కమిషనర్ కులేంద్ర నాథ్ డేకా తెలిపిన వివరాల ప్రకారం, గువహటిలోని ఏఎస్‌టీసీ క్యాంపస్ మరియు జమ్ము తవి ఎక్స్‌ప్రెస్ రైలులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత వీరందరినీ తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు.