కర్ణంపేట కస్తూరిబా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: దండేపల్లి
దండేపల్లి మండలంలోని కర్ణంపేట కస్తూరిబా పాఠశాలను ప్రత్యేక అధికారి దుర్గాప్రసాద్, ఎంపీడీవో ప్రసాద్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని ఉపాధ్యాయులను వారు ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను పరిశీలించడంతో పాటు విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.