పాలడుగులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు డివైడర్‌ను ఢీకొన్న కారు.. రెండేళ్ల చిన్నారికి కూడా గాయాలు..

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి మహబూబాబాద్ వైపు వెళ్తున్న TS26E7993 నంబర్‌ గల కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కాగా, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి.ప్రమాదంలో గాయపడిన వారిలో శ్వేత, భార్గవ్‌తో పాటు వారి రెండేళ్ల కుమార్తె ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తమ అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ రహదారిపై సూచికలు సక్రమంగా లేకపోవడం కారణంగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ రహదారిపై వలిగొండ నుండి అనాధపురం వరకు తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.