పాఠశాలల విద్యార్థులకు తీపి కబురు: మధ్యాహ్న భోజనంలో హల్వా, ఉపమా

రిపోర్టర్: గోపి స్థలం: లక్నో

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అదనపు పోషకాహారంగా హల్వా మరియు ఉపమా అందించనున్నట్లు ప్రాథమిక విద్య అదనపు ప్రధాన కార్యదర్శి పార్థసారథి సేన్ శర్మ వెల్లడించారు. వచ్చే ఏడాది నవంబర్ నుంచి ప్రారంభం కానున్న ఈ పథకం ద్వారా విద్యార్థులకు వారానికి ఒకసారి ఈ రుచికరమైన ఆహారాన్ని అందించనున్నారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు బడులకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను పెంచడమే ఈ సరికొత్త కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు.