ఆర్థిక సాయం అందజేత: రాజాపేటలో జై శ్రీరాం ఫౌండేషన్ ఉదారత
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట గ్రామంలో గిరుక పోచయ్య మృతి చెందడంతో కుటుంబానికి జై శ్రీరాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజాపేట సర్పంచ్ కోయ మధు, ఫౌండేషన్ సభ్యులు మరియు పలువురు గ్రామస్థులు పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.