తప్పిపోయిన మహిళను కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
రిపోర్టర్: సునీల్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో కనిపించకుండా పో మహిళను పోలీసులు విజయవంతంగా వెతికి పట్టుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి ఆ మహిళను క్షేమంగా గుర్తించారు. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. ఈ త్వరితగతిన స్పందించి బాధితురాలిని చేర్చిన కంచరపాలెం పోలీస్ సిబ్బంది ప్రతిభను విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ప్రత్యేకంగా అభినందించారు.