యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సులో అగ్నిప్రమాదం తొమ్మిది మంది దుర్మరణం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: గ్రేటర్ నోయిడా

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒక మహిళతో సహా కనీసం తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.