కర్ణాటకలో మహిళ దారుణ హత్య మరియు మృతదేహంపై చిన్నారి రోదన
రిపోర్టర్: సురేష్
స్థలం: కర్ణాటక
కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూర్ సబ్ డివిజన్ ఆర్‌హెచ్ క్యాంప్ ప్రాంతంలో 25 ఏళ్ల స్నేహను కొందరు వ్యక్తులు రాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. ఏడుస్తున్న ఏడాదిన్నర వయస్సున్న చిన్నారిని మృతదేహంపై ఉంచి హంతకులు పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త అమిత్, ప్రియుడు శుభమ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.