ఏపీ మున్సిపల్ ఎన్నికల్ లో కూటమి హవా: పులివెందులలోనూ తెలుగుదేశం పార్టీ ఘన విజయం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Amaravati

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ సొంత నియోజకవర్గమైన కడప జిల్లా పులివెందులలోనూ తెదేపా జెండా ఎగిరిందని, తిరుపతి, చిత్తూరు, గుంటూరు మేయర్ స్థానాలను కూటమి కైవసం చేసుకుందని మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా తొంభై రెండు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో కొనసాగుతున్న కౌంటింగ్ లో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారని అధికారులు తెలిపారు.