సిద్దిపేటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి మరియు మాజీ ఎమ్మెల్సీ అరెస్ట్

రిపోర్టర్: శివ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబు జగ్జీవన్ రావు చౌరస్తా సమీపంలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి స్వగృహంలో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్సీతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి నుండి రూ. 11,600 నగదు మరియు నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.