హస్నాపురంలో ఘనంగా లీలా కైవల్యా రెడ్డి జన్మదిన సంబరాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: అనుమసముద్రంపేట

ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తనయ శ్రీమతి ఆనం లీలా కైవల్యా రెడ్డి జన్మదిన వేడుకలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండలంలోని హసనాపురంలో అత్యంత ఘనంగా జరిగాయి. అబ్బోయ్ రమేష్ నాయుడు సూచనల మేరకు తెలుగు యువత గ్రామ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి సందడి చేస్తూ ఆమెకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు.