అభిషేక్ శర్మ పేలవమైన రికార్డు చెత్త ప్రదర్శనతో అభాసుపాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: Japan
జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. జపాన్ బౌలర్ చార్లీ హారా-హిన్సే బౌలింగ్‌లో షోమా సుగాయా-స్లేటర్ క్యాచ్ పట్టడంతో అభిషేక్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ ఏడాది టీ20ఐల్లో అభిషేక్‌కు ఇది ఐదో తొలి బంతి డక్ కావడం గమనార్హం. అలాగే టీ20 క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా పది డక్‌లు నమోదు చేసిన ఆటగాడిగా అవాంఛిత రికార్డును తన పేరున రాసుకున్నాడు.