'వినాయకా వెళ్లి రావయ్యా..': రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణేశ్ నిమజ్జనాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. కడప, తిరుపతి, అనంతపురం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి డప్పు వాయిద్యాలు, టపాసుల మోతల మధ్య బొజ్జగణపయ్యను గంగమ్మ చెంతకు చేర్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరు, దేవుని కడప, తిరుపతి, ఉరవకొండ, ఆత్మకూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కృత్రిమ కొలనులు, కేసీ కెనాల్, హెచ్‌ఎల్‌సీ కాలువలు తుంగభద్ర దిగువ కాల్వల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.