మహిళల భద్రతకు భరోసానిస్తూ సాగుతున్న షీ టీం అవగాహన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: సిర్పూర్-టి
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు సిర్పూర్-టి జిల్లా పరిషత్ హైస్కూల్లో షీ టీం ఆధ్వర్యంలో బాలికలు మరియు మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాగజ్‌నగర్ షీ టీం ఇన్చార్జి ఏఎస్ఐ సునీత విద్యార్థినులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మహిళా చట్టాలు, డయల్ 100, 112, సోషల్ మీడియా జాగ్రత్తలు, ఈవ్ టీజింగ్ మరియు సైబర్ క్రైమ్‌పై సమగ్ర అవగాహన కల్పించారు.