తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: Amaravati

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రానున్న రోజుల్లో ఇది మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. బుధవారం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే సమయంలో గంటకు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు.