తమిళనాడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

రిపోర్టర్: కృష్ణ స్థలం: తమిళనాడు

తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది. కంబైండ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-వన్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రిలిమ్స్ పరీక్ష సెప్టెంబర్ 27, 2026 న రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్‌లో ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనుంది.