'నక్షత్రాల వైపు ప్రయాణం ప్రారంభం': దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' రిలీజ్ డేట్ ఖరారు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న తాజా ప్యాన్ ఇండియా చిత్రం 'ఆకాశంలో ఒక తార' విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్యూట్ లవ్ ఎంటర్టైనర్ మూవీని ఈ ఏడాది నవంబర్ 20న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్ బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.