మహర్షి వాల్మీకి రామాయణం సమాజానికి ఎనలేని జీవన పాఠాలు నేర్పుతుందని జి కిషన్ రెడ్డి వెల్లడి

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

మహర్షి వాల్మీకి రచించిన రామాయణం గ్రంథం వేల సంవత్సరాలు గడిచినా నేటికీ సమాజానికి సరికొత్త జీవన పాఠాలను నేర్పుతూనే ఉందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రామాయణం ద్వారా నిరంతర కృషి, సేవాభావం, కరుణ మరియు సామాజిక విలువలు మానవాళికి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయని పేర్కొంటూ ఆయన సామాజిక మాధ్య వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ గ్రంథం అందించే ఆదర్శాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని వెల్లడించారు.