భారీ షాక్: సౌదీ అరేబియా విమాన సర్వీసులు నవంబర్ 14 వరకు రద్దు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
ప్రస్తుత భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సౌదీ అరేబియాకు నడిపే విమాన సర్వీసులపై తాత్కాలిక నిషేధం విధించినట్లు ఎయిర్ ఇండియా మరియు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు వెల్లడించాయి. జెడ్డా, రియాద్, దమ్మామ్లకు రాకపోకలు సాగించే విమానాలను నవంబర్ 14 వరకు రద్దు చేసినట్లు ప్రకటించాయి. ప్రయాణికుల భద్రతకే తమ ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేస్తూ, టికెట్ల రీబుకింగ్ లేదా పూర్తి నగదు వాపసు సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థల యాజమాన్యం పేర్కొన్నాయి.