కారు డ్రైవర్‌కు హెల్మెట్ జరిమానా వేసిన ఏఐ కెమెరా

రిపోర్టర్: హరి స్థలం: కర్ణాటక

కర్ణాటకలోని బెళగావి జిల్లా అథణిలో ఏఐ కెమెరా చేసిన విచిత్ర పొరపాటు కలకలం రేపింది. కారు నడుపుతున్న సుభాష్ అనే వ్యక్తి హెల్మెట్ ధరించలేదంటూ ఆటోమేటెడ్ సిస్టమ్ రూ.500 జరిమానా విధించింది. షాక్‌కు గురైన బాధితుడు నిజంగానే హెల్మెట్ వేసుకుని మరీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిరసన తెలిపాడు. పొరపాటును గుర్తించిన పోలీసులు చివరకు ఆ చలాన్‌ను రద్దు చేశారు.