మహిళల్లో గుండెపోటు ముప్పు: నిర్లక్ష్యం చేయకూడని ఐదు కీలక హెచ్చరికలు
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
మహిళల్లో గుండె జబ్బుల లక్షణాలు చాలా వరకు భిన్నంగా ఉంటాయని కార్డియాలజిస్ట్ డాక్టర్ అర్పిత్ కే పటేల్ వెల్లడించారు. ఛాతిలో తీవ్రమైన నొప్పి లేకుండానే తీవ్రమైన అలసట, ఊపిరి ఆడకపోవడం, దవడ లేదా వెనుక భాగంలో నొప్పి, అజీర్తి, వికారం వంటి సమస్యలు గుండెపోటు ముప్పును సూచిస్తాయని ఆయన తెలిపారు. ఈ లక్షణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సాధారణ ఆరోగ్య సమస్యలుగా తేలికగా తీసుకోవద్దని, వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ప్రాణాలను కాపాడుతుందని ఆయన హెచ్చరించారు.