'విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారు.. నారా లోకేష్ జైల్లో ఉండాలి': సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు

రిపోర్టర్: మహేష్ స్థలం: Amaravati

డీఎస్సీ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం కాకుండా సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైయస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ స్కామ్‌లో ఉన్న అధికారులెవరు? క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎవరి మధ్య జరిగాయని ఆయన నిలదీశారు. యువత, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే జైల్లో ఉండాలని సజ్జల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.