ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌ను అరెస్టు చేయాలని సీజేపీ నిరసన

రిపోర్టర్: కృష్ణ స్థలం: New Delhi

జంతర్‌మంతర్ వద్ద దళిత విద్యార్థిని తండ్రిపై దాడి చేసినట్లు స్వతంత్ర భరద్వాజ్ పాడ్‌కాస్ట్‌లో అంగీకరించడంపై సీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిందితుడిపై ఎస్సీ/ఎస్టీ చట్టం, హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ అండతోనే నిందితుడు విర్రవీగుతున్నాడని, వెంటనే అరెస్టు చేయాలని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు.