పాలకొండలో హోరువానను లెక్కచేయకుండా దూసుకుపోతున్న జనసేన అభ్యర్థి అనేం శారద

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: పాలకొండ

పాలకొండ నగరపంచాయితీ ఎన్నికలలో భాగంగా నాలుగో వార్డు జనసేన అభ్యర్థి అనేం శారదా హోరువానలో సైతం విస్తృతంగా ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. తుఫాను వర్షాన్ని లెక్కచేయకుండా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి జనసేన పార్టీ గుర్తు అయినటువంటి గాజు గ్లాసు పై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.