జపాన్ లో క్రికెట్ మైదానాల ఏర్పాటు వెనుక అద్భుత శ్రమ

రిపోర్టర్: రాజేష్ స్థలం: జపాన్

జపాన్ లోని నగోయా నగరంలో ఆసియా క్రీడల కోసం బేస్‌బాల్ మైదానాన్ని అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంగా మార్చడం వెనుక పెద్ద శ్రమే ఉంది. జపాన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా, శ్రీలంక నిపుణుల సహకారంతో కొరోగీ అథ్లెటిక్ పార్క్ ను క్రికెట్ వేదికగా తీర్చిదిద్దారు. గామిని డి సిల్వా, అసిిత విజయసింఘే వంటి ప్రముఖ క్యూరేటర్ల పర్యవేక్షణలో ఇక్కడ పిచ్ లు, అవుట్ ఫీల్డ్ ను అత్యంత కష్టపడి అభివృద్ధి చేశారు.