గుంటూరు దంపతుల గొప్పదనం: అమెరికా విశ్వవిద్యాలయానికి పది కోట్ల భారీ విరాళం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: గుంటూరు
అమెరికాలో స్థిరపడిన గుంటూరుకు చెందిన ప్రవాసాంధ్రులు డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ, రమ దంపతులు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి పది కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించినట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ విరాళాన్ని శాశ్వత నిధి కింద జమ చేసి, దాని ద్వారా వచ్చే వడ్డీతో ప్రతిభ గల వైద్య విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామని డీన్ డాక్టర్ జోస్ ఎమ్ భారల్ సాంచేజ్ తెలిపారు. సమాజానికి తిరిగి కొంత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సహాయం చేసినట్లు దాతలు పేర్కొన్నారు.