నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం: రోడ్డు ప్రమాదంలో హెచ్ఎం దుర్మరణం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న భూపతిదాసు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని అధికారులు తెలిపారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ ఘటన పట్ల పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.