నెల్లూరులో విద్యార్థుల కోసం 43 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 43 అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో ల్యాబ్‌కు రూ.20 లక్షల నిధులు కేటాయించి అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. అలాగే, జవహర్ నాలెడ్జ్ సెంటర్ల ద్వారా ఏటా 800 మందికి పైగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. డీకే ప్రభుత్వ కళాశాలలో కొత్తగా ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.