పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక కేంద్రంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత్ సేవా సహకార ఫోరం ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ తెలంగాణ చైర్మన్ సౌజన్యంతో, ట్రస్ట్ సభ్యుడు మురళి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్రెడ్డి రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు విగ్రహాలు అందజేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నిర్వాహకులు పిలుపునిచ్చారు.