కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేశీయ ఆయిల్ పామ్ రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే బాధ్యతారాహిత్యమైన నిర్ణయమని ఆయన మండిపడ్డారు. కేంద్రం తన దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయాన్ని తక్షణమే పునఃసమీక్షించాలని, దేశీయ రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.