భారీ వర్షాలు మరియు ప్రణాళిక లోపంతో ఓట్ల లెక్కింపులో తీవ్ర జాప్యం
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయవాడ
భారీ వర్షాలు మరియు అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా పలు ప్రాంతాల్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, ఒంగోలు, గుంటూరు జిల్లాలలో సిబ్బంది సకాలంలో కేంద్రాలకు చేరుకోకపోవడం వల్ల కౌంటింగ్ ఆలస్యమైందని పేర్కొన్నారు. అనంతపురంలో వర్ష ప్రభావం లేకపోయినా ప్రణాళిక లోపం వల్ల ఇదే సమస్య తలెత్తిందని, దీనితో ఫలితాల వెల్లడిలో తీవ్ర గందరగోళం ఏర్పడిందని స్పష్టం చేశారు.