రఘునాథపూర్ పాఠశాలలో ఉత్సాహంగా విద్యార్థుల వ్యాసరచన పోటీలు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపూర్ పాఠశాలలో వృద్ధుల సంక్షేమ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఎంఈఓ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో తల్లిదండ్రుల పోషణ బాధ్యత అంశంపై విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలలో గెలుపొందిన విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేసి అభినందించారు.