అమెరికాలో కలకలం: ముప్ పై ఏళ్ల తర్వాత మీజిల్స్ తో చిన్నారి మృతి

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూయార్క్

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మీజిల్స్ సోకడంతో ఒక చిన్నారి మృతి చెందినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. గత ముప్ పై సంవత్సరాలలో రాష్ట్రంలో ఇదే తొలి మీజిల్స్ మరణం కావడం తీవ్ర కలకలం రేపింది. వ్యాక్సిన్ వేయించుకోకపోవడం వల్లే ఈ ప్రాణాంతక వైరస్ మళ్లీ కోరలు చాచుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక లక్షణాలను గుర్తించి తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.