మహిళల ఆసియా కప్ ట్రోఫీ ప్రెజెంటేషన్ పై కొత్త వివాదం
రిపోర్టర్: సతీష్
స్థలం: India
మహిళల ఆసియా కప్ ఫైనల్ పోరులో భారత్ విజయం సాధిస్తే ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత మహిళల జట్టు నిరాకరించే అవకాశం ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ గా ఉన్న నఖ్వీ వైఖరిని వ్యతిరేకిస్తూ పురుషుల జట్టు కూడా గతంలో ఇలాగే బహిష్కరించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వివాదం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.