ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై రేవంత్ సర్కార్ అసత్య ప్రచారం

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8,889 కోట్లకు చేరగా, అందులో రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనివే రూ.5,200 కోట్లు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం నెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ అసత్య ప్రచారం చేస్తున్నదని, నిధులు విడుదల చేయకుండా నిరుపేద విద్యార్థులను, కాలేజీ యాజమాన్యాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.