లక్షెట్టిపేటలో ఉత్సాహంగా మొదలైన జిల్లా స్థాయి వాలీబాల్ సమరం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: లక్సెట్టిపేట
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తిని పెంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య కోరారు. మంచిర్యాల జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించి విద్యార్థులు మరింత ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు.