ఇస్కాన్ డెవలపర్స్ కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు
రిపోర్టర్: VG ReddyD SrJournalist
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు నగరం అన్నమయ్య కూడలి వద్దనున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఇస్కాన్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ కార్యాలయంలో సోమవారం వినాయక చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ రసం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక మట్టి వినాయకుని నెలకొల్పి, సంస్థ ఉద్యోగులు, మార్కెటింగ్ సిబ్బంది పూజలు చేసి, ఎలాంటి విఘ్నాలు లేకుండా వ్యాపార అభివృద్ధి జరగాలని స్వామిని ప్రార్థించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.