ఆదిలాబాద్లో రైతు గర్జన సభ: పోస్టర్ను ఆవిష్కరించిన బాల్క సుమన్
రిపోర్టర్: మహేష్
స్థలం: మంచిర్యాల
నవంబర్ ఒకటో తేదీన ఆదిలాబాద్లో కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ రైతు గర్జన సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించి సభా ఏర్పాట్లను పరిశీలించినట్లు బాల్క సుమన్ - మాజీ ఎమ్మెల్యే చెన్నూర్ వెల్లడించారు. ఈ సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అట్టడుగు స్థాయి నుంచి రైతుల సమస్యలపై గళం విప్పేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని స్పష్టం చేశారు.