భద్రత గాలికొదిలేయడంతో ఆకతాయిల అడ్డాగా మారిన వనపర్తి ఎకో పార్క్

రిపోర్టర్: కృష్ణ స్థలం: వనపర్తి

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎకో పార్క్లో భద్రత కొరవడడంతో అది ఆకతాయిలకు అడ్డాగా మారుతోందని పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కులో నిఘా వ్యవస్థ లేకపోవడంతో ఇటీవల ఓ మైనర్ బాలిక గర్భం దాల్చిన ఘటనలో పోక్సో కేసు నమోదై భద్రతా లోపాలు బట్టబయలయ్యాయి. కంచె, సీసీ కెమెరాలు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని, తక్షణమే నిఘా కట్టుదిట్టం చేయాలని డీఎఫ్వో నవీన్ రెడ్డిని ప్రజలు కోరుతున్నారు.