సర్వేలు గురుకుల పాఠశాలను సందర్శించి అభినందించిన బక్కి వెంకటయ్య

రిపోర్టర్: KOLA MAHESH స్థలం: నారాయణపురం

సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేలు గురుకుల పాఠశాలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నతికి గురుకుల విద్య ఎంతగానో దోహదపడుతుందని, సర్వేలు గురుకులం ద్వారా ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారని కొనియాడారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించారు.