'భోగాపురం ZPHSకు అంతర్జాతీయ స్థాయి రూపు': ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Bhogapuram, Vizianagaram
భోగాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలను అంతర్జాతీయ స్థాయి LEAP మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దే దిశగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చర్యలు చేపట్టారు. ఈరోజు పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఆమె, విద్యార్థులకు మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ బడుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.