చార్మినార్ వద్ద గణేష్ నిమజ్జనానికి ఐదు వేల పోలీసులతో బందోబస్తు
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
గణేష్ నిమజ్జన శోభాయాత్ర మరియు శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ పరిసరాల్లో ఐదు వేల మంది పోలీసులతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే వెల్లడించారు. శోభాయాత్రకు వచ్చే భక్తులకు, ప్రత్యేక ప్రార్థనలకు వచ్చే ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశామని, శాంతియుత వాతావరణంలో నిమజ్జనం విజయవంతం చేయాలని ప్రజలను డీసీపీ కోరారు.