తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఘనంగా గరుడ సేవ

రిపోర్టర్: మహేష్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో అత్యంత పవిత్రమైన గరుడ సేవ అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని శ్రీమహావిష్ణువు అవతారమైన మలయప్ప స్వామిని దర్శించుకున్నారు. ప్రజలందరిపై శ్రీవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అందరినీ స్వామివారు సన్మార్గంలో నడిపించాలని వేడుకున్నారు.