గడిగెడ్డ జలాశయానికి మహర్దశ: పదకొండు కోట్ల నిధులతో శరవేగంగా ఆధునికీకరణ పనులు

రిపోర్టర్: అశోక్ స్థలం: గరివిడి

గడిగెడ్డ జలాశయాన్ని పదకొండు కోట్ల రూపాయల నిధులతో ఆధునికీకరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నాగావళి జలాలతో గడిగెడ్డను నింపి చంపావతి నదిలోకి నీళ్లు పంపి లక్షలాది మందికి తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పనులు అటకెక్కగా, ప్రస్తుతం అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.