తెలంగాణ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పెంపు

రిపోర్టర్: Raju Reporter స్థలం: ఆత్మకూర్

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్లో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 30 వరకు గడువు ఉందని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ ఆత్మకూర్ ప్రధానోపాధ్యాయులు ఎండీ మక్సూద్ అలీ తెలిపారు. ఎస్సెస్సీకి 14 ఏళ్లు, ఇంటర్కు 15 ఏళ్లు పైబడిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.